జిల్లా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు… బాధిత కుటుంబం
భద్రాద్రి కొత్తగూడెం బుర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలోని తమ భూమి ధరణి పోర్టల్ లో మాయం అయిందని బాధిత కుటుంబం వాపోతోంది. మొత్తం 39 ఎకరాల భూమి ఉండగా, ధరణి పోర్టల్ లో 30 ఎకరాలు మాత్రమే చూపుతుందన్నారు. ముగ్గురు అన్నతమ్ముళ్లకు ఒక్కొక్కరికి 13 ఎకరాలు ఉండగా, కేవలం 10 ఎకరాలు మాత్రమే ధరణి పోర్టల్ చూపుతుందన్నారు. ఒక్కొక్కరు 3 ఎకరాల భూమి కోల్పోయామని కుటింబీకులు ఆవేదన చెందుతున్నారు.
పొలం పట్టా కాగితాలు ఉన్నప్పటికీ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మొదట 13 ఎకరాలకు రైతు బంధు వచ్చిందని ఆ తర్వాత 10 ఎకరాలకు మాత్రమే వస్తోందని మిగితా భూమి వివరాలు కూడా ధరణి పోర్టల్ లో కనిపించడం లేదని వారు తెలిపారు. ఈ విషయమై ప్రజా భవన్ కి చేరుకొని ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేయడానికి వచ్చామన్నారు.
Discussion about this post