Gas Shortage: టెన్షనొద్దు.. నౌకలు వచ్చేస్తున్నాయ్! గ్యాస్ సరఫరాపై కేంద్రం మరో కీలక ప్రకటన

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్‌ కొరతపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఎలాంటి కొరత లేదని.. ప్రజలు ఆందోళనతో బుకింగ్స్‌ చేయడం వల్లే సమస్య వచ్చిందని పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ పేర్కొంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ మళ్లీ ప్రారంభించినట్టు తెలిపింది.

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలో ఎల్‌పీజీ సరఫరాపై నిలిచి పోయిందని ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. దీంతో గ్యాస్ దొరుకుతుందో లేదో అని జనాలు ఎగబడి బుకింగ్స్ చేసుకోవడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో దేశంలోని గ్యాస్ కొరతపై తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎలాంటి కొరత లేదని.. ప్రజలు ఆందోళనతో బుకింగ్స్‌ చేయడం వల్లే సమస్య వచ్చిందని పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ పేర్కొంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ మళ్లీ ప్రారంభించినట్టు తెలిపింది. LPG కొరత నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా సిలిండర్లు దొరకవేమోనన్న భయంతో ప్రజలు ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారని.. ఇప్పటివరకు దాదాపు 88 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయని ఆమె తెలిపింది. అవసరమైతే తప్ప ముందస్తు బుకింగ్స్ చేయవద్దని కోరింది. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్‌పీజీ కొనుగోలుదారుగా ఉందని.. మన దేశానికి వచ్చే ఎల్‌పీజీలో 90 శాతం వాటా హార్ముజ్ గుండానే వస్తున్నాయని పేర్కొంది.

అయితే ప్రస్తుతం అక్కడ రాకపోకలు నిలిచిపోవడం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇరాన్ భారత్‌కు సహకరిస్తుందని పేర్కొంది. అటు నుంచి భారత్‌కు వచ్చే నౌకలను అడ్డుకోబమని ఇప్పటికే ఇండియాకు ఇరాన్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఇదే అంశంపై పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో హర్మూజ్‌ నుంచి రెండు LPG నౌకలు భారత్‌కు వస్తున్నాయని తెలిపారు. అంతేకాదు భారత్‌లో పెట్రోల్, డీజిల్, చమురు నిల్వలు తగినంతగా ఉన్నాయని, వాటి విషయంలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసింది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top