ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. తుమ్మిడిహెట్టిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగు..!

ఉత్తర తెలంగాణ రైతాంగం దశాబ్దాల కల అయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది.

ఈ ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం బ్యారేజీ ఎత్తు 148 మీటర్లుగా నిర్ణయించారు. అయితే, ఈ ఎత్తు వల్ల నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని తాజా ఇంజనీరింగ్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే, బ్యారేజీ ఎత్తును 150 మీటర్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎత్తు పెంచితే మహారాష్ట్రలో ముంపు సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున, ఆ రాష్ట్రాన్ని ఒప్పించడం ఇప్పుడు ప్రధాన కర్తవ్యంగా మారింది.

ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం ఒక స్పష్టమైన కాలపరిమితిని విధించుకుంది. తొలి దశలో వారం రోజుల్లోగా చీఫ్ ఇంజనీర్లు, కార్యదర్శుల స్థాయిలో మహారాష్ట్ర అధికారులతో చర్చలు పూర్తి చేయడం. రెండో దశలో 15 రోజుల్లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మహారాష్ట్ర సీఎంతో భేటీ కావడం.

ముందుగా హెడ్ రెగ్యులేటర్, బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడం, ఆపై నీటిని శ్రీపాద ఎల్లంపల్లికి తరలించే మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో హెడ్‌వర్క్ పనులు పూర్తి కాకుండానే ఇతర కాలువ పనులు చేపట్టడం వల్ల నిధులు వృథా కావడమే కాకుండా ప్రాజెక్టు ఆలస్యమైందనే విమర్శలు ఉన్నాయి. ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా, ముందుగా బ్యారేజీ నిర్మాణానికే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, తాగునీటి ఎద్దడి తీరుతుంది. అంతర్రాష్ట్ర వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుని, ఈ “వరప్రదాయిని”ని సాకారం చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top