పీవీ సునీల్ కుమార్‌కు రఘురామ కౌంటర్..

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ప్రత్యర్థులకు సవాల్ చేశారు. దమ్ముంటే తన ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేయించాలని సవాల్ చేశారు. తన తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలోనే చేశానని అన్నారు.

RRR Counter to IPS PV Sunil Comments

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైసవుడిగా ఉండటం నేరమా.. బ్యాంకులకు కన్నాలు వేయడం నేరమా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎవరైనా చర్చికి వెళ్లినా.. ఇంట్లో బైబిల్, జీసస్ ఫోటో ఉన్నా క్రైస్తవులు కాదన్నారు. కేవలం బాప్టిజం తీసుకున్నవాళ్లు మాత్రమే క్రైస్తవులతారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు.. హైకోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు సునీల్ కుమార్.

తాను సీఐడీ చీఫ్‌గా ఉండి ఏకంగా 4వేల అట్రాసిటీ కేసులపై ఛార్జ్‌షీట్‌లు వేయించానని చెప్పుకొచ్చారు. మతం మారితే కులం పోతుందా.. కుల వివక్ష పోతుందా అంటూ ప్రశ్నించారు.

ప్రత్యర్థులకు పీవీ సునీల్ కుమార్ సవాల్
నా తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలోనే చేశా.. హల్లెలూయ అంటున్నా
దమ్ముంటే తన ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయించాలన్న పీవీ సునీల్
క్రైస్తవుడిగా ఉండటం నేరమా? బ్యాంకులకు కన్నాలు వేయడం నేరమా?
చర్చికి వెళ్లినా.. ఇంట్లో బైబిల్, జీసస్ ఫొటో ఉన్నా క్రైస్తవులు కాదు
బాప్టిజం తీసుకున్నవాళ్లు మాత్రమే క్రైస్తవులు -పీవీ సునీల్
హైకోర్టు తీర్పును అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా
సీఐడీ చీఫ్‎గా ఉండి 4వేల అట్రాసిటీ కేసులపై ఛార్జిషీట్లు వేయించా
మతం మారితే కులం పోతుందా?.. కుల వివక్ష పోతుందా? -పీవీ సునీల్

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ వ్యాఖ్యలకు రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు. 4వేల SC, ST కేసుల్లో చార్జిషీట్ సునీల్ ఎలా వేయిస్తారని అట్రాసిటీ కేసులతో సీఐడీకి అసలు సంబంధమేంటని? రఘురామ ప్రశ్నించారు. 4000 కేసుల్లో సునీల్ చార్జిషీట్ వేయించాననడం టూమచ్ అని అన్నారు. తన కస్టోడియల్ టార్చర్ కేసుతో సునీల్ కు సంబంధం ఉందని మండిపడ్డారు. అట్రాసిటీ కేసుల చార్జిషీట్లలో సునీల్ పాత్రపై విచారణ జరపాలని.. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు

  • సీఐడీ మాజీ చీఫ్ సునీల్ వ్యాఖ్యలకు రఘురామకృష్ణరాజు కౌంటర్
  • 4వేల SC, ST కేసుల్లో చార్జిషీట్ సునీల్ ఎలా వేయిస్తారు? -రఘురామ
  • అట్రాసిటీ కేసులతో సీఐడీకి అసలు సంబంధమేంటి? -రఘురామ
  • 4000 కేసుల్లో సునీల్ చార్జిషీట్ వేయించాననడం టూమచ్
  • నా కస్టోడియల్ టార్చర్ కేసుతో సునీల్ కు సంబంధం ఉంది
  • అట్రాసిటీ కేసుల చార్జిషీట్లలో సునీల్ పాత్రపై విచారణ జరపాలి
  • ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తా -రఘురామకృష్ణరాజు

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top