ఇరాన్‌పై భారీస్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ చెప్పిన కొద్దిసేపట్లోనే ఆ హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధపు మంటలు తీవ్రమయ్యాయి. ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇవి ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం చేశామని పేర్కొంది.

ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో భారీగా పేలుళ్లు జరిగాయి. మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ ప్రాంతాలపై అమెరికా దృష్టిసారించింది. మరోవైపు కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రతినిధులు ప్రాధేయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
దీనిని ఇరాన్ కొట్టిపారేసింది. ఈవిడతలో దాడులు ముగిసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అయితే, అమెరికా ప్రతిపాదిత ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే రేపు రాత్రి దాడులు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితగినట్లే ఇరాన్‌లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకొంది. మొత్తం 49 తోమహాక్ క్షిపణలను ఈ దాడుల్లో వినియోగించినట్లు పేర్కొంది. ఇరాన్‌కు 64 కిలోమీటర్ల దూరంలోని కొన్ని లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతోపాటు ఫైటర్ జెట్లు కూడా దాడుల్లో పాల్గొని పర్షియన్ గల్ఫ్ వద్ద ఇరాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దెబ్బతీసినట్లు వెల్లడించింది.
Follow for more updates
