ఆమె భర్తతో విడాకులు ఇస్తామని కూతురిని పిలిపించి చం*పేసిన తల్లి, తాత ! | Srikakulam Harini Mu*der Case

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన హరిణి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్న వివాహిత హరిణిని స్వగ్రామానికి రప్పించి, ఆమె తల్లి, తాత, భర్త కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ, హరిణి ముందుగానే రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కేసును ఛేదించడంలో కీలక ఆధారంగా మారింది. కన్న తల్లే వివాహితురాలైన తన కుమార్తెను కడతేర్చిన దారుణ ఘటన ఇది. దానికి మృతురాలి భర్త, మామ సహకరించటం మరో విశేషం. హైదరాబాద్ లో ఉంటూ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వివాహితను పథకం ప్రకారం స్వగ్రామానికి రప్పించి హతమార్చారు. తర్వాత ఆమె గుండెపోటుతో మృతి చెందింది అని చెప్పి గుట్టుగా దహనసంస్కారాలు చేసేసారు. అయితే అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేసేసరికి ఆమెది సాధారణ మరణం కాదు.. హత్య అని తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సోర్లిగాం గ్రామంలో దారుణం జరిగింది. దుంపల హరిణి అనే వివాహిత తన ఇంటిలో దారుణ హత్యకు గురైంది. ఆమెను హత్య చేసింది ఇంకెవరో కాదు ఆమె కన్నతల్లి పైల విజయకుమారి, ఆమె తాత బలుసాకు. అయితే ఇందులో ఆమె భర్త దుంపల దంతేశ్వరరావు హస్తం ఉంది. ఈనెల 1వ తేదీ రాత్రి దుంపల హరిణినీ సోర్లిగాం లోని ఆమె నివాసంలో గుట్టుగా హత్య చేసేసారు ముగ్గురు నిందితులు.

ఆమె గుండెపోటుతో మృతి చెందింది అని చెప్పి తెల్లవారుజామున ఆమె మృతదేహానికి గుట్టుగా దహన సంస్కారాలు కానిచ్చేశారు. అయితే అనుమానం వచ్చి పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా ఆమెది సాధారణ మరణం కాదు హత్య అని తేలింది. మృతురాలి తల్లి, తాత, భర్త హంతకులనీ తేల్చారు పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు పోలీసులు..

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top