హైదరాబాద్ లో భయంకర పేలుడు.. | Badangpet godham Incident | Hyderabad

హైదరాబాద్‎లోని బడంగ్‎పేట్‎లో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని పదార్థం పేలి.. అనూప్ అనే కార్మికుడు మృతి చెందాడు.

మృతుడు మూడు రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్ లోని కోల్‎కతా నుంచి డెకరేషన్ గోదాంలో పని చేసేందుకు బడంగ్‌పేట్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో మృతుడు చెత్త కుప్ప సమీపంలో ఉండగా, అందులో ఉన్న గుర్తుతెలియని పదార్థం ఒక్కసారిగా పేలింది.

పేలుడు తీవ్రతకు మృతుడి చేతులు, కాళ్లు తునాతునకలై శరీర భాగాలు సుమారు 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

  • రంగారెడ్డి జిల్లా బడంగ్‎పేట్‎లో పేలుడు.. కార్మికుడు మృతి
  • గుర్తు తెలియని పదార్ధం పేలి అనూప్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి
  • పేలుడు తీవ్రతకు ఎగిరిపడిన కార్మికుడి శరీర భాగాలు
  • ఇటీవల కోల్‎కతా నుంచి పనుల కోసం కార్మికుడు వచ్చినట్టు సమాచారం
  • పేలుడుకు కారణమైన పదార్ధం ఏమిటన్న దానిపై పోలీసుల దర్యాప్తు

Follow for more updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *