ఒక్క సినిమా టైటిల్‌తో ప్రాంతీయ చిచ్చు..! | Idupu Kayitham Movie Controversy | 4sidestv

ఎక్స్ వేదికగా మరోసారి ప్రాంతీయ చిచ్చు రాజేస్తూ కొందరు చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిన్నటి వరకు హీరోల ఫ్యాన్ వార్స్‌తోనే బోర్ కొట్టిన నెటిజన్లకు, ఇప్పుడు ‘ఇడుపు కాయితం’ రూపంలో సరికొత్త ఆంధ్ర వర్సెస్ తెలంగాణ పొలిటికల్ అండ్ కల్చరల్ వార్ టేస్ట్ చూపించారు కొందరు అటెన్షన్ సీకర్స్

ఇండస్ట్రీలో ఒక సినిమా టైటిల్ ఈ రేంజ్ రచ్చ లేపుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ప్రియదర్శి హీరోగా, ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్‌గా అనౌన్స్ అయిన ‘ఇడుపు కాయితం’ మూవీ అలా ఓపెన్ అయిందో లేదో నెట్టింట ఒక్కసారిగా వార్ మొదలైంది. అసలు ఆ మాండలికానికి అర్థం ఏంటో కూడా తెలుసుకోకుండా, సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు, మీమ్స్‌తో నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు.

ఆంధ్రాలో ఈ సినిమా చూడాలంటే మాకు తెలుగు సబ్‌టైటిల్స్ కావాలా” అంటూ కొందరు వేసిన పోస్టులు.. రెండు ప్రాంతాల సినిమా లవర్స్ మధ్య పెద్ద డిబేట్‌కే దారితీశాయి. దీనికి తోడు, ఇటీవల పొలిటికల్ ఇష్యూస్‌లో వేలు పెట్టి ఆల్రెడీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉన్న నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఈ డిస్కషన్‌లో దూకడంతో, ఈ మంట కాస్తా నెక్ట్స్ లెవెల్‌ గొడవకు దారితీసింది. నిజానికి ఇడుపు కాయితం అనేది భార్యాభర్తలు విడిపోయేటప్పుడు రాసుకునే అచ్చమైన తెలంగాణ విడాకుల అంగీకార పత్రం.

ఈ ట్విట్టర్ వార్‌పై సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇచ్చుకుంటోంది. తెలంగాణ నెటిజన్లు ఈ కామెంట్‌పై ఒక రేంజ్‌లో భగ్గుమంటూ, తెలంగాణ యాసను, మాండలికాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్‌లు ఇస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ కల్చర్ ఇప్పుడు రూల్ చేస్తోందని, ఒకప్పుడు కామెడీకి, విలనిజానికి మాత్రమే వాడిన యాస ఈరోజు బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతోందని గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నారు. మరికొందరు మాత్రం, కొరియన్, మలయాళ, తమిళ సినిమాలు కూడా సబ్‌టైటిల్స్ పెట్టుకుని చూసే జనాలు, మన పక్క రాష్ట్ర భాషను అర్థం చేసుకోలేరా అని, ఇదంతా కేవలం ఎంగేజ్‌మెంట్ కోసం, బ్లూ టిక్ రెవెన్యూ కోసం చేస్తున్న చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు.

కథ నచ్చితే కల్చర్‌తో పనిలేదని నిరూపించిన ఎన్నో ఉదాహరణలను ప్రస్తావిస్తూ న్యూట్రల్ ఆడియన్స్ ఈ గొడవను విశ్లేషిస్తున్నారు. ప్యూర్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘బలగం’ సినిమాను ఆంధ్రాకు చెందిన మెగాస్టార్ చిరంజీవి భుజాన వేసుకుని ప్రమోట్ చేశారని, అలాగే ఆంధ్ర మూలాలున్న నాని ‘దసరా’తో తెలంగాణ ఊరమాస్ హిట్ కొట్టాడని గుర్తు చేస్తున్నారు. చిత్తూరు యాసతో వచ్చిన ‘పుష్ప’ అయినా, ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ అయినా కథలో దమ్ముంటే జనాలు బ్రహ్మరథం పడతారే తప్ప యాసను అడ్డుగా పెట్టరని, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ‘ఇడుపు కాయితం’ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్ స్వయంగా పాలకొల్లు వ్యక్తి కావడమేనని తేల్చి చెప్తున్నారు. కేవలం కొందరు జనాలు ట్విట్టర్ వ్యూస్ కోసం వేసే పిచ్చి పోస్టులను పట్టుకుని, మొత్తం సినిమా ఇండస్ట్రీకి లేదా ఒక ప్రాంత ప్రజలకు ఆపాదించి విద్వేషాలు రెచ్చగొట్టడం ముమ్మాటికీ మూర్ఖత్వమేనని, సినిమా అనేది ఎప్పుడూ ఎమోషన్‌ను మాత్రమే చూస్తుందని మెజారిటీ ఆడియన్స్ ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ వేస్తున్నారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top