Rashmika Mandanna : నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. ఎంతో చెప్పాలని ఉంది.. కానీ.. రష్మిక ఎమోషనల్..

2016లో కిరిక్ పార్టీ సినిమాతో నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసి.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.

పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్నా. ఇన్నాళ్లు వరుస హిట్లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. తాజాగా ఓ నెటిజన్ రష్మిక, విజయ్ ప్రేమ, పెళ్లి గురించి ఓ కథనం రాసుకొచ్చారు. ఇది చూసిన రష్మిక రిప్లై ఇస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. చాలా రోజులుగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంతగా భావోద్వేగానికి గురి కాలేదని తెలిపింది.

తల్లిగా ఎంతో పోరాడా.. సుప్రీంకోర్టులోనూ నా కూతురికి న్యాయం దక్కలేదు – ప్రత్యూష తల్లి

“నేను చాలా కాలంగా నా గురించి రాసిన కథనం చదివి ఎప్పుడూ ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. నేను చెప్పాలనుకున్నది చాలా ఉంది. కానీ నాకు మాటలు రావడం లేదు. ఇప్పుడు నేను ప్రత్యేకమైన స్థానాన్ని వెతుక్కునే కొత్త ప్రయాణంలో సంతోషంగా ఉన్నాను. నా ప్రయాణాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేను చెప్పగలిగేది ఒక్కటే. మిమ్మల్ని స్వేచ్ఛగా ఉంచే ప్రేమను వెతకండి” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

రష్మిక సినిమాల విషయానికి వస్తే.. కొన్నాళ్లుగా వరుస హిట్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, థామా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఏందయ్యా సామి సాంగ్ ఆకట్టుకుంటుంది.

Follow for More Updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top