మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమాకు హీరోయిన్ ఎట్టకేలకు దొరికింది. మోడల్, క్లాసికల్ డ్యాన్సర్ ప్రీతి ముకుందన్‌ను ఫైనల్ గా ఫిక్స్ చేశారు. ప్రీతి ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేసిందని చెబుతున్నారు. ఆ సినిమాలో కెవిన్‌తో కలిసి ఆమె నటించిందట. ఇప్పుడు కన్నప్ప సినిమాతో ఆమె పేరు యమ స్పీడ్ గా ట్రెండింగ్ లోకి వస్తోంది.
ప్రీతి రాక కోసం కన్నప్ప చిత్రయూనిట్ ఆసక్తిగా వెయిట్ చేస్తోందంటూ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రీతి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. కన్నప్పలో డార్లింగ్ ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ప్రస్తుతం న్యూజీలాండ్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తొలుత కన్నప్ప సినిమా హీరోయిన్ గా నుపుర్ సనన్ చేయాల్సి ఉంది. కానీ డేట్స్ విషయంలో క్లాష్ రావడంతో ఆమె తప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానంలో భరత నాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతి ముకుందన్ ను తీసుకున్నారు.
కాకపోతే సినిమా షూటింగ్లో చిత్ర యూనిట్‌కు చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య డ్రోన్ తగలటంతో విష్ణు చేతికి గాయమైంది. రీసెంట్గా డ్యాన్స్ మాస్టర్‌కు గాయమైంది. అయినా షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగిస్తున్నారు. సినిమా కోసం మోహన్ బాబు కుటుంబమంతా న్యూజిల్యాండ్ లోనే ఉండటం విశేషం. మహాభారతం సీరియల్‌తో తన సత్తా చాటుకున్న ముఖేష్ సింగ్…. కన్నప్పను అత్యద్భుతంగా తీస్తున్నాడనే టాక్ నడుస్తోంది.
Discussion about this post