మావోయిస్టు దళం చెర నుండి మహిళల విముక్తి కోసం పోరాడదామంటూ ప్రజా స్వామ్య ఆదివాసీ సంఘం పేరుతో పోస్టర్లు విడుదలవడం కలకలం సృష్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, రైస్ పేట, కొయ్యూరు, సుబ్బంపేట, రాళ్ల గూడెం గ్రామాలలో ఈ పోస్టర్లు వెలిశాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీటిని విడుదల చేశారు. మావోయిస్టు దళంలో మహిళల పట్ల లింగ వివక్షకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదామని పోస్టరులో పిలుపు ఇచ్చారు. మాయదారి మావోయిస్టులను తరిమికొట్టి ఆదివాసి మహిళాభివృద్ధికి తోడ్పడుదామని పేర్కొన్నారు.
Discussion about this post