పట్టణ, పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠధామాలు సమస్యలకు ఆలవాలం గా మారాయి .. కొన్ని లక్షల రూపాయల వ్యయంలో ప్రారంభించిన వైకుంఠ ధామాలకు అధికారుల పర్యవేక్షణ, నిర్వహణ కరవైంది.ముఖ్యం గా కొన్ని చోట్ల కాటికాపరి కూడా లేరు . మృత దేహాలను దహనం చేయటానికి అనువైన వసతులు కూడా కరువయ్యాయి . విద్యుత్ దహన వాటిక కూడా ఉపయోగం లో లేదు .
విద్యుత్ దహన వాటిక పాడైపోయి చాల రోజులైనా అధికారులు పూర్తి చర్యలు తీసుకోక పోవటం తో పనిచేయటం లేదు . వర్షాకాలం కట్టెలతో దహన క్రియలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి .పరిసరాలు శుభ్రం చేయక పోవటం తో దుమ్ముకొట్టుకు పోయాయి .లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాంగణాలు కొంతవరకు బాగున్నా , మిగతాభాగం పనికి రాని వస్తువులతో దుమ్ము , బూజులతో నిండిపోయింది . అక్కడి యంత్ర సామాగ్రి ఉపయోగంలో లేక , మరమ్మత్తులకు నోచుకోక వెచ్చించిన సొమ్ము వ్యర్థం అవటమే కాక , ఉపయోగానికి సౌకర్యం గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు . శ్మశాన వాటికలలో అనేక సమస్యలు ఉన్నా అధికారులు నిర్లక్ష్యం కనిపి స్తోంది.
Discussion about this post