జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 5న అనకాపల్లి వెళ్తున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఉమ్మడి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, బీజేపి జిల్లా కన్వీనర్ పనగంటి అప్పారావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 5వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి షెడ్యూల్ ఖరారైన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అనకాపల్లి వచ్చినప్పుడు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేశారని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ రోడ్ షోను విజయవంతం చేయాలన్నారు.
Discussion about this post