ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ అడవిలో కార్చిచ్చు చెలరేగింది. దాదాపు 40 గంటల నుంచి మండుతున్న అడవిని కాపాడేందుకు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మిగ్ 17 హెలికాప్టర్ ద్వారా బంబి బకెట్ ఆపరేషన్లతో మంటలపై నీళ్లు చల్లుతున్నామన్నారు.
నైనిటాల్ లోని 31 కొండ ప్రాంతాల్లోని అందమైన పైన్ చెట్లన్నీ తగలబడుతున్నాయి. గత రెండు రోజులుగా భూమియాధర్ జ్యోలికోట్, నారాయన్ నగర్, భవాలి, రామ్ ఘర్, ముక్తేశ్వర్ ప్రాంతాలు అగ్రికి ఆహుతవుతున్నాయి. నైనిటాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు దగ్గర్లోనే ఈ మంటలు చెలరేగాయి. అధికారుల సమాచారం మేరకు రాష్ట్రంలోని 31 అటవీ ప్రాంతాల్లో మంటలు రేగాయి. దీంతో 33.34 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్దం అయ్యింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అటవీ అధికారులతో పరిస్థితులపై చర్చించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు భారత వైమానిక దళం శాయశక్తులా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టామన్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడం ఛాలెంజ్ గా మారిందన్నారు. దగ్గర్లోని భీమటాల్ సరస్సు నుంచి హెలికఫ్టర్లు నీళ్లు తీసుకు వచ్చి మంటలను ఆర్పుతున్నాయన్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ సహాయం అర్జించామన్నారు. ఈ పరిస్థితుల్లో నైనిటాల్ సరస్సులో బోటింగ్ ను జిల్లా అధికారులు నిషేధించారు. రాష్ట్ర హైకోర్టు కాలనీ దగ్గర్లోకి అగ్నికీలకాలు చేరుకున్నాయి. ప్రస్తుతం 40 మంది అటవీ అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నారని సీఎం వివరించారు.
Discussion about this post