కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. కోనాపూర్ గ్రామానికి చెందిన అరిగే సాయినాథ్ పోస్టల్ ఉద్యోగి, ఈయన పై చీటింగ్ కేసు ఉందని విచారణ నిమిత్తం నాచారం కు చెందిన పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి ఆయనను హైదరాబాద్ తీసుకెళ్లినట్టు బాన్స్వాడ టౌన్ సిఐ కృష్ణ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు ఇలా జాగ్రత్త పడ్డారని ఆయన తెలిపారు. కానీ సాయినాథ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా కూడా కిడ్నాప్ అని తప్పుగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని సూచించారు. ఇలాంటి పనులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు ఉంటాయని తెలిపారు.
Discussion about this post