ప్రకృతి అంటేనే …ఎన్నో అద్భుతాల సమ్మేళనం. నిత్యం పొగలు గక్కే నది కూడా ఆ అద్భుతాలలో ఒకటి… ఈ బాయిల్డ్ రివర్ దక్షిణ అమెరికాలోని పెరువియన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన్ నదికి ఉపనది కూడా. ప్రపంచంలో మరుగుతున్న నది ఇదొక్కటే. దీని పేరు షానయ్-టింపిష్కా. ఆ నది కథేమిటో చూద్దాం.
ఈ బాయిల్డ్ రివర్ ప్రపంచ వింతల్లో ఒకటి . నిజానికి ఇది లా బొంబా నదిగానే ప్రసిద్ధి చెందింది. ఇది సుమారు 6.4 కిలోమీటర్లు పొడవుంటుంది. ఈ నది నీటి ఉష్ణోగ్రతలు 212 డిగ్రీల ఫారెన్‌హీట్ స్థాయిలో ఉంటాయి. ఇలా ఈ నది ఎందుకు నిత్యం మరుగుతూ పొగలు గక్కుతూ ఉంటుంది అనేది ఓ అంతు పట్టని మిస్టరీ.
అక్కడ ఉండే రాతినేలల్లో విపరీతమైన వేడి ఉండటంతో ప్రవహించే నీరు వేడెక్కి మరుగుతుందని చెబుతుంటారు. మరికొందరూ భూ ఉష్ణోగ్రత కారణంగా అని అంటారు. మరి మిగతా నదులు అలా లేవు కదా… కేవలం ఈ నది ఇలా ఎందుకు ఉందని? చాలా మంది మదిని తొలిచే ప్రశ్న. దీనికి గల కారణం గురించి ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. కొన్ని పరిశోధనలు జరిగినా కారణాలు కనుగొన లేకపోయారు. ఈ మరుగుతున్న నది నీటిలో ఏవైనా పడితే క్షణాల్లో ఉడికిపోతాయి. ఈ నది నీటిలో చేతులు పెడితే అంతే సంగతులు. అప్పుడప్పుడు ప్రమాదవశాత్తూ పక్షులు నీటిని తాగబోయి మరణించాయని స్థానికులు చెబుతుంటారు. ఈ నదీ జలాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయని స్థానికులు అంటారు.
అందుకే ఈ ప్రాంతానికి జనాలు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక పర్యావరణ ప్రేమికులు ఇలా పర్యాటకులు ఈ సహజ సిద్ధ ప్రకృతి అద్భుతాల వద్దకు వస్తే . అవి కూడా కాలుష్యానికి గురవుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధమైన ఈ నది ని రక్షించడం కోసం పర్యాటకుల తాకిడిని తగ్గించేలా ఇప్పటికే పలు ఆంక్షలు విధించే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
























Discussion about this post