భారతీయ రైల్వే.. ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని చిన్న స్టేషన్లు బార్ అండ్ రెస్టారెంట్లుగా మారుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అవుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్. స్వచ్ఛ్ భారత్ స్పూర్తి ఇక్కడి అధికారులకు ఇసుమంతైనా లేని కారణంగా స్టేషన్ ఆవరణ డంపింగ్ యార్డులా తయారైంది. స్టేషన్ ను మందుబాబులు బార్ అండ్ రెస్టారంట్ లా వాడుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
నెల్లూరు సౌత్ స్టేషన్ నగరం నడిబొడ్డున ఉండటంతో ఇక్కడ ఆగే మెము, ప్యాసింజర్ రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చేవారు ఇక్కడ నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే స్టేషన్ ఆవరణ, అండర్ పాస్ లు చెత్తా చెదారంతోను, పగిలిన మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు.
ప్రయాణికుల బైట్స్.. 5.00 టూ 6.15 నిమిషాల వరకు
రాత్రి పొద్దు పోయాక ప్రయాణికుల తాకిడి ఉండక పోవడంతో ఆకతాయిల చేష్టలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. మందుబాబుల చేష్టలతో పరిసర ప్రాంతాల వారు విసుగెత్తి పోతున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Discussion about this post