శౌర్యవ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’ తాజాగా అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. న్యూయార్క్‌లో జరిగిన ‘ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో’ హాయ్ నాన్న ఉత్తమ చిత్రంతో సహా మొత్తం 11 అవార్డులను సొంతం చేసుకుంది.తండ్రీ, కూతురు సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విషయమై దర్శకుడు శౌర్యవ్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ఇంత ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. హయ్ నాన్న కోసం మేమంతా పడిన కష్టానికి ఫలితమిది అన్నారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్ ట్రాక్, ఉత్తమ ఎడిటింగ్‌ల్లో విభాగాల్లో సత్తా చాటింది. ‘హాయ్ డాడీ’ పేరుతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Discussion about this post