సార్వత్రిక ఎన్నికలకు జనసేన, టిడీపీ, బీజేపీ పార్టీల పొత్తు ఖరారైన నేపథ్యంలో… విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుంచి ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరు దాదాపు ఖరారైంది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు కష్టపడి పనిచేసిన సీనియర్లను పక్కన పెట్టారని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించారని, ఈ నిర్ణయం పట్ల పునరాలోచించుకోవాలని అంటున్న జనసేన నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాసరావు.
Discussion about this post