మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం తెలంగాణ జాతికి గర్వ కారణమని జాతీయ బీజేపి ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓడిన సమయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుపై అపనిందలు వేశారని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చాకచక్యంతో ప్రభుత్వాన్ని నిలబెట్టారని, సుస్థిరమైన పాలన దేశానికి అందించారని అన్నారు.ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం…భారత అత్యున్నత భారతరత్న అవార్డును అందించడం తెలంగాణ సమాజానికి… తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు.
Discussion about this post