నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ మూవీతో హీరోగా రజినీకాంత్ బ్యాక్ బౌన్స్ అయ్యారు.
అంతేకాదు కలెక్షన్స్ పరంగా తాను ఎందుకు సూపర్ స్టార్ అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్‌లో సుభాష్ కరణ్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరగుతోంది. ఈ చిత్రానికి వెట్టైయాన్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రజినీకాంత్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు.
వెట్టైయాన్ సినిమాలో నటిస్తూనే కూతురు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లాల్ సలాంలో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. జీవితా రాజశేఖర్ ఈ సినిమాలో రజినీకాంత్ చెల్లెలు పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విశాల్ హీరోగా నటిస్తుండగా, రజినీకాంత్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారని తెలుస్తుంది.
























Discussion about this post