ప్రజాస్వామ్య దేశం… ఎంతో ఉన్నత విలువలు గల దేశం… ప్రతి పౌరుడు చాలా బాధ్యతగా ఉండే దేశం… ఇది భారత దేశం….. కానీ వీటన్నింటికి వ్యతిరేకంగా ఉండే భారత్ కూడా ఉంది సుమా. ముఖ్యంగా రాజకీయ నాయకులు విసిరే మాటలకు… వాళ్లించే సొమ్ముకు కకృత్తి పడుతుంటారు. ఇది వినడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా సరే… అదే నిజం. ఓట్లకు ముందు ఎన్ని నిబంధనలు పెట్టినా తెర ముందు ఒకటి… తెర వెనుక మరోకటి… అదేనండి ప్రలోభాలు. నాయకులిచ్చే డబ్బులు తీసుకుంటూ. ఆరోజుకు సంబర పడ్డా. రాబోయే ఐదేళ్ల మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.. ఇంతకి రాజకీయా నాయకులు ఇచ్చే ఎన్నికలప్పుడు ఇచ్చే వాటి ప్రతి రోజు లెక్కగడితే ఎంతవుతుంది.. వాటి వివరాలేంటి.. మీ కోసం
దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి… నాయకులు తమ పార్టీతో పాటు…తమను గెలిపించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తారు… ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు కాదు… ఏళ్ల నాటి నుంచి ఎన్నికల్లో నాయకులు అనుసరిస్తుంది… అధికారం కోసం నానా తంటాలు పడుతారు. ప్రజలను అనేక ప్రలోభాలకు గురిచేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటును కొనడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతుంటారు. ఇది భారత దేశంలో చాలా సాధారణ విషయం అయ్యిపోయింది. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం నాయకులు డబ్బులు, వస్తువుల రూపంలో ఓటర్లను ఆకర్షిస్తుంటారు. ఓటుకు ఇంత అని లెక్కలేసి వారికి కట్టబెడతారు. కేవలం నగదు, వస్తువులే కాదు. ఓటింగ్ సమయంలో బిర్యాని, మందు లాంటివి కూడా ఇచ్చేస్తుంటారు. దాన్ని ఎంచక్కా తీసుకొని ఎవరో ఒకరికి ఓటస్తే పోలే అనే పంథాల్లోకి జనం కూడా వెళ్లిపోయారు.
కొన్నిసార్లు రాజకీయ నాయకులు వారి గెలుపు కోసం ప్రత్యర్థులు ఇచ్చే డబ్బులు తీసుకొని… ఓటు వేయాల్సిన వారికే వేయాలని కోరుతుంటారు. అంటే వారు కూడా బాధ్యతను విస్మరించినట్లే. డబ్బులు తీసుకుని ఓటు వేయడం తప్పని తెలిసినా అలా చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ అదే చేస్తున్నారు. ఇంతకి ఓట్ల కోసం ఓటరు తీసుకునే డబ్బులు ప్రతిరోజుకు లెక్కగడితే ఎంతో వస్తుందో ఒకసారి చూద్దాం..500 ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 0.27 పైసలు..1000 రూపాయలు ఇస్తే 0.56 పైసలు.. 1500 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 0.82 పైసలు.. 2000 రూపాయలు ఇస్తే రోజుకు రూపాయలు 1.10 పైసలు.. 2500 రూపాయలు ఇస్తే రోజుకు రూపాయలు 1.37 పైసలు.. 3000 రూపాయలు ఇస్తే రోజుకు రూపాయలు 1.65 పైసలు.. 4000 రూపాయలు ఇస్తే రోజుకు రూపాయలు 2.20 పైసలు. 5000 రూపాయలు ఇస్తే రోజుకు రూపాయలు 2.74 పైసలు లెక్కగట్టొచ్చు.
ఈ లెక్కలు చూస్తూ ప్రతి రోజు ఒక చాక్లెట్ విలువ చేయవ్వు రాజకీయనేతులు ఇచ్చే డబ్బులు… ఈ డబ్బుల కోసమా ప్రజలు కకృతి పడేది… ఈ డబ్బుల కోసం దిగాజరిపోవడం. నేతల దగ్గర డబ్బులు తీసుకుంటే ఇంత దుస్థితిలో ఉంటామా. ఈ లెక్కలు చూస్తే డబ్బులు తీసుకున్న వారికి ఇంత దారుణంగా ఉన్నామా అనిపిస్తోంది
బానిస బతుకులు అసలే వద్దు.. మన బిడ్డల భవిష్యత్తు మనకు ముద్దు..ఆలోచించి ఓటు వేయ్యండి… తలరాత మార్చుకొండి. ఓటు అనే ఆయుధంతో సమ సమాజాన్ని నిర్మించుకోండి.. మనం వేసే ఓటు 5 ఏళ్లు అన్నం పెట్టేలా ఉండాలి.ఒక రోజు బిర్యాని పెట్టేలా కాదు. ఓటరు మహాశయులారా… ఒక్క క్షణం ఆలోచించి… నిర్ణయం తీసుకోండి…
TABLE
ఒక సంవత్సరానికి 365 రోజులు ఐదు సంవత్సరాలకు 1825 రోజులు ఓటుకు వాళ్ళు ఇచ్చేది రోజు వారీగా లెక్కిస్తే
1. 500 ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 0.27 పైసలు
2. 1000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 0.56 పైసలు
3. 1500 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 0.82 పైసలు
3. 2000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 1.10 పైసలు
4. 2500 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాన రోజుకు రూపాయలు 1.37 పైసలు
5. 3000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 1.65 పైసలు
6. 4000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 2.20 పైసలు
7. 5000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 2.74 పైసలు
Discussion about this post