నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో త్రిముక పోటీ నెలకొంది. అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బిజెపి పసుపు బోర్డు హామీతో ప్రజల్లోకి వెళ్తుండగా…కాంగ్రెస్ మాత్రం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామనే హామీతో ముందుకు వెళుతోంది. అయితే బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ సైతం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి నిజామాబాద్ లో ప్రజలు పనిచేసే వ్యక్తినే ఎంపీగా గెలిపిస్తారని ఆయన అన్నారు. తను ఎంపీగా విజయం సాధిస్తే ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు.
Discussion about this post