పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 01 జులై 1952లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చిత్తూరు జిల్లా , పుంగనూరు లో జన్మించాడు. ఆయన 1975లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.
1974 లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1978 లో జనతా పార్టీ అభ్యర్థిగా, 1985, 1994 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1989, 1999, 2004 లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2009 లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అదే సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశాడు.
ఆయన 2013లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014 , 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.ఆయన 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ భాద్యతలను 21 సెప్టెంబర్ 2020న ప్రభుత్వం అప్పగించింది.
























Discussion about this post