నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంకు బ్యాలెన్స్ రూ.1.10 కోట్లుగా . స్థిరాస్తుల విలువ రూ.1.98 కోట్లు గా గుర్తించారు . రూ.2.93 కోట్ల విలువై నోట్ల కట్టలు లభ్యమైయ్యాయి . నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగి వద్ద కోట్ల ఆస్తులు లభ్యం కావడం మొదటి సారి . మొత్తం గా రూ.6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడి జరిపారు. అలాగే అర కిలోకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 1.98 కోట్లు విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది.
Discussion about this post