సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల మూడు ఇసుక ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. అధికారుల అనుమతితోనే ఇసుకను తీసుకెళ్లాలని సూచించారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
Discussion about this post