ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే చర్యలు తప్పవని రైస్ మిల్లర్లని మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కొమటిరెడ్డిని కలిసిన రైతులు, ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పారు. మిల్లర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి క్వింటాకు 3 వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని, లేకుంటే మిల్లులను సీజ్ చేస్తామన్నారు.
Discussion about this post