శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, హిందూపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి బికే పార్థసారథి ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల ఏకైక నాయకుడు మన చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పెనుకొండ, హిందూపురం పార్లమెంటు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Discussion about this post