భర్త కోసం పూజలు.. పునస్కారాలు చేసే భార్యలనే ఇంతవరకు చూసాం. కానీ నటి మహాలక్ష్మి . భర్త కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న నాజూకుదనాన్ని పక్కనపెట్టి భారీగా బరువు పెరగాలని కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ఫాటీ ఫుడ్ తెగ తింటున్నారు.
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ భారీకాయంతో ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో నాజూకుగా ఉండే నటి మహాలక్ష్మి ఆయనను వివాహం చేసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావటం విశేషం. వారిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ అవటం తెలిసిందే. డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. అయినా ఇవన్నీ పట్టించుకోకుండా వీరిద్దరూ లైఫ్‌ను ఆనందంగా లీడ్ చేస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి తమ జీవితం గురించి, భర్త గురించి ఓపెన్‌గా మాట్లాడింది. బరువు తగ్గాలని రవీందర్ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరడం లేదని, అందుకే ఆయనలా తయారవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. దీని కోసం అధికంగా కొవ్వు పదర్థాలు తింటున్నానని చెప్పింది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భర్త చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించింది. కానీ రవీందర్ జుట్టు నెరిసిపోవడం బాధ కలిగిస్తోందని వాపోయింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Discussion about this post