తెలుగు నటి రాశి సింగ్ ‘స్వాన్ ది ఫ్యాషన్ ఫెయిర్’ ను ఫిల్మ్ నగర్ లోని కన్వెన్షన్ హాల్లో ప్రారంభించారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ లో మహిళలకు అందానిచ్చే ఇయర్ హ్యాగింగ్స్, స్టడ్స్, రింగ్స్ , వెరైటీ బ్యాంగిల్స్, చోకర్స్, బ్రేస్ లెట్స్, బీడ్స్ , హ్యాండ్ మేడ్ టెర్రకోట జ్యూవెలరీ, గిఫ్ట్ ఆర్టికల్స్, శారీస్, డ్రస్సెస్, ఉన్నాయని అంజలీ రెడ్డి తెలిపారు. తన ఫ్రెండ్
స్వాతి వేములతో కలసి దీనిని ప్రారంభించామన్నారు. మొదటి సీజన్ విజయవంతం అయ్యిందని, రెండో సీజన్ ను ప్రారంభించామన్నారు. 50 కంటే ఎక్కువ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయన్నారు. మహిళలకు అవసరమయ్యే అన్ని వస్తువులను ఒకే చోట ఉంచామని స్వాతి చెప్పారు.
Discussion about this post