గట్టమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు
రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి.. స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా గట్టమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి ములుగు పట్టణం వరకు సాగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి ములుగు జిల్లా కేంద్రానికి మంత్రి సీతక్క రావడంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. సీతక్క కు సాంప్రదాయ నృత్యాలు. కోలాటాలతో ఆదివాసీలు స్వాగతం పలికారు.
Discussion about this post