ఒకపక్క ప్రపంచమంతా ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో హడలెత్తిపోతుంటే.. మరోపక్క పాకిస్థాన్-ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి.

పాక్‌లోని కీలక సైనిక స్థావరాలపై ఆఫ్ఘన్ తాలిబాన్లు సైనిక ఆపరేషన్ చేపట్టారు. మారూఫ్ జిల్లాలో పాక్-ఆఫ్ఘన్ బలగాల మధ్య కాల్పులు జరిగాయి. పాక్ మిలిటరీ పోస్టుకు తాలిబన్లు నిప్పంటించడంతో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. అంతేకాకుండా షోరాబాక్ ప్రాంతంలోని పాకిస్తాన్ ఔట్ పోస్ట్ తో పాటు పాక్ మిలిటరీ ఆయుధాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తమ వైమానిక దళం పాక్‌లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు అఫ్గాన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారీ దాడులు చేపట్టినట్లు తెలిపింది. క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పబ్లుంఖ్వాలోని పలు కీలకమైన పాక్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్ల
తమ దేశంలోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడిందని.. పాక్ చొరబాట్లకు ప్రతీకారం తీర్చుకొనేందుకే ఈ దాడులు చేశామని అఫ్గాన్ తెలిపింది. తమ దాడుల్లో నూరాఖాన్ ఎయిర్బేస్ సహా ఇతర సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. మరోవైపు తూర్పు అఫ్గాన్ నగరమైన జలాలాబాద్‌లో పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్ అధికారులు వెల్లడించారు.

విమాన పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడుల వల్ల ధ్వంసమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను పాక్ ఇప్పటికీ రిపేర్ చేసుకుంటోంది. తాజాగా అఫ్గాన్ సైతం దానినే లక్ష్యంగా చేసుకోవడంతో పాక్‌కు మరింత నష్టం వాటిల్లింది.
పాకిస్థాన్-ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత
మారూఫ్ జిల్లాలో పాక్-ఆఫ్ఘన్ బలగాల మధ్య కాల్పులు
మిలిటరీ పోస్టుకు నిప్పంటించిన తాలిబన్లు
ఇద్దరు పాక్ సైనికులు మృతి, ముగ్గురికి గాయాలు
షోరాబాక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఔట్‌పోస్ట్ స్వాధీనం
పాక్ మిలిటరీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
