ఐపీఎల్-17లో భాగంగా రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యమిస్తున్నది. ఈ నెల 31న చెన్నయ్‌తో, ఏప్రిల్ 3న కోల్‌కతాతో ఢిల్లీ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించిన ఆయన…ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. రోహిత్ శర్మ కూడా ఏసిఎ ఏర్పాట్లు చూసి అభినందించారని అన్నారు.
Discussion about this post