అమలాపురంలో ఉదయం 5 గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది.పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జనసేన,బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆనందరావు 4sides టీవీ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సంక్షేమ పథకంలో భాగంగా గ్రామ గ్రామాన పెన్షన్ పంపిణీ పండగ వాతావరణం నెలకొందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు.ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయడం నా అదృష్టమని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ప్రకారం పెరిగిన పెన్షన్, బకాయిలు కలిపి రూ.7 వేలు రూపాయలు లబ్ధిదారులకు అందజేసారు.కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు 6 వేలు,తీవ్ర వ్యాధులు కలిగిన వారికి 15 వేలు ఇస్తోంది .























Discussion about this post