స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి భార్యాభర్తలుగా ఒక దశాబ్దం పూర్తి చేసుకున్నారు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలది ప్రేమ వివాహం అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. భిన్న నేపధ్యాలు కలిగిన బన్నీ, స్నేహా రెడ్డి పరిచయం, ప్రేమ, వివాహం ఎలా జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…
వరంగల్ అమ్మాయి స్నేహా రెడ్డి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఇండియాకు వచ్చారు. స్నేహా రెడ్డి తండ్రి హైదరాబాద్ లో ప్రముఖ విద్యా సంస్థలకు అధిపతి. నేటివ్ వరంగల్ అయినా కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఉన్నతమైన కుటుంబం. ఇక అప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ అయిన అల్లు అర్జున్… యూత్ లో మంచి ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. స్నేహారెడ్డి, అల్లు అర్జున్ లవి భిన్నమైన నేపధ్యాలు కలిగిన కుటుంబాలు. అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమకు చెందినవారు కాగా.. స్నేహారెడ్డి కుటుంబానిది బిసినెస్ నేపథ్యం. ఈ రెండు భిన్న ధృవాలను ప్రేమ… పెళ్లి బంధం వైపు నడిపించింది.
ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో మొదటిసారి స్నేహా రెడ్డిని అల్లు అర్జున్ కలిశారట. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది.లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్న తీరుగా మొదటి చూపులోనే అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమలో పడిపోయారు. ఇక ఇద్దరూ తమ ఫోన్ నంబర్స్ ఎక్స్ చేంజ్ చేసుకున్నారట. ఫోన్ సంభాషణలలో స్నేహారెడ్డి, అల్లు అర్జున్ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియపరుచుకున్నారట. అలా పెళ్లి చేసుకోవాలని… తమ ప్రేమను పెద్దవారితో తెలియజేశారు. అల్లు అర్జున్ ప్రేమను మన్నించి నిర్మాత అల్లు అరవింద్… స్నేహారెడ్డి ఫాదర్ ని కలిసి సంబంధం గురించి మాట్లాడరట. సినిమా నేపథ్యం అంటే నచ్చని స్నేహారెడ్డి తండ్రి పెళ్ళికి అంగీకరించలేదట. అప్పటికే ఘాడమైన ప్రేమలో ఉన్న స్నేహారెడ్డి, అల్లు అర్జున్ మాత్రం పట్టువీడలేదట. పెళ్లి అంటూ జరిగితే అల్లు అర్జున్ తోనే జరగాలని స్నేహ.. స్నేహానే నా భార్య అంటూ అల్లు అర్జున్ పట్టుబట్టారట. ఇక రెండవసారి ప్రయత్నాలలో స్నేహారెడ్డి తండ్రి పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది.
2011 మార్చ్ 6న హైదరాబాద్ లో అల్లు అర్జున్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. స్టార్ హీరోయిన్ కి మించిన గ్లామర్ కలిగిన స్నేహారెడ్డి… అల్లు అర్జున్ కి సరైన జోడీ అని అందరూ కొనియాడారు. పరిశ్రమ ప్రముఖులు అందరూ ఈ వివాహానికి హాజరయ్యారు. అల్లు అర్జున్, స్నేహ ప్రేమ బంధానికి గుర్తుగా 2014లో కొడుకు అయాన్ పుట్టాడు. అలాగే 2016లో రెండవ సంతానంగా అమ్మాయి అర్హ జన్మించింది. ఇక పిల్లలు, భార్యకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే అల్లు అర్జున్ ఖాళీ సమయం దొరికితే వారితో గడుపుతారు.
Discussion about this post