వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం పట్టణంలో టిడిపి ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో టిడిపి ఎంపీ అభ్యర్ధి గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే అభ్యర్ధి అయితాబత్తుల ఆనందరావుల విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం నాడు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలలో ఐటి, సాఫ్ట్ వేర్ రంగాలలో పని చేస్తున్న స్థానిక యువత ఈ ర్యాలీలో పాల్గొని టిడిపికి మద్దతుగా నినాదాలు చేశారు. మేము సైతం రాష్ట్రం కోసం, ఓట్ ఫర్ సిబిఎన్, జాబు కావాలంటే బాబు రావాలి, సైకో పోవాలి- సైకిల్ రావాలి అంటూ ఐటి యువత నినాదాలు హోరెత్తించారు.
యువతను ఉద్దేశించి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు మాట్లాడుతూ… టిడిపి హయాంలో చంద్రబాబు, లోకేష్ కృషితో అనేక ఐటి కంపెనీలు వివిధ నగరాలకు వచ్చాయని, వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించాయని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ‘జె’ ట్యాక్స్ కి భయపడి ఆయా కంపెనీలు రాష్ట్రం విడిచిపోయాయని, ఫలితంగా యువతకు నూతన ఉద్యోగాల మాట అటుంచి.. ఉన్న ఉద్యోగాలే కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది యువత ఉపాధి లేక అల్లాడిపోతున్నారని చెప్పారు. టిడిపి కూటమి అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం భవిష్యత్ బాగుంటుందని సతీష్ బాబు విజ్ఞప్తి చేశారు.
అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నల్ల వంతెన, ఎర్ర వంతెన, వెంకటేశ్వర స్వామి గుడి రోడ్డు, పుల్లయ్య గారి రామాలయం సెంటర్, శ్రీరాంపురం సెంటర్, హైస్కూల్ సెంటర్, గోఖలే సెంటర్, బ్యాంక్ స్ట్రీట్, నారాయణపేట, సినిమా రోడ్డు , అమలాపురం బస్టాండ్, మున్సిపల్ కాలనీ, ఎఎంజి కాలనీ వరకు సుమారు 10 కిలోమీటర్లు సాగింది. జోన్- 2 తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు మంతెన సీతారామరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి అల్లాడ స్వామినాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post