అమెరికాతో చర్చలు లేవ్..ఇరాన్ సంచలన ప్రకటన

అమెరికాతో చర్చలపై ఇరాన్ యూటర్న్ తీసుకుంది. యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతోందంటూ వస్తోన్న వార్తలను ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లరిజానీ ఖండించారు. అమెరికాతో జరిపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. దౌత్య పరమైన వ్యవహారాల్లో అమెరికాకు చెత్త రికార్డు ఉందన్నారు.

ట్రంప్ భ్రమల్లో, ఊహా లోకంలో ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ దాడులను తాము మొదలుపెట్టలేదని.. ట్రంప్ తన తప్పుడు ఆకాంక్షలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని అన్నారు. అలాగే, ఇజ్రాయెల్‌ అధికార కాంక్ష కోసం అమెరికా సైనికులను బలి చేస్తున్నారని అలీ లరిజానీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్‌ దాడులు చేపట్టింది. దీంతో పరిస్థితులు మరింత దిగజారాయి. కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్‌ డ్రోన్‌ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకుందని సమాచారం. .

మరోవైపు, ఇరాన్‌ డ్రోన్‌ దాడులతో బహ్రెయిన్‌ రాజధాని మనామాతో పాటు దుబాయ్‌, దోహా, అబుదాబిలోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్‌లోని ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు డ్రోన్లను ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. సైప్రస్‌లోని బ్రిటన్‌ నౌకాదళ స్థావరంపై డ్రోన్‌ దాడి జరిగింది.

ఈ దాడిలో స్వల్ప నష్టమే జరిగిందని సైప్రస్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఇక, ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత మోగుతోంది. ఇరాన్‌ నుంచి వచ్చే క్షిపణులను తమ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ అడ్డుకుంటోందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

అమెరికాతో చర్చలపై ఇరాన్ యూటర్న్ విదేశాంగ మంత్రి ప్రకటనపై ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ యూటర్న్ అమెరికాతో చర్చలు లేవ్ దౌత్య పరమైన వ్యవహారాల్లో అమెరికాది చెత్త రికార్డు ట్రంప్ భ్రమల్లో, ఊహా లోకంలో ఉంటారు అమెరికాతో చర్చించాలని అనుకోవడం లేదు ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని.. ప్రకటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి.

Follow us for more updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *