హైదరాబాద్ లో నీటి ఎద్దడి రోజు రోజుకి పెరుగుతోంది. ఒక్క మార్చి నెలలోనే ఎస్ ఆర్ నగర్ డివిజన్ -6లో 5,484 మంది వినియోగదారులు 17,232 ట్యాంకర్లు బుక్ చేశారు. మణికొండ వాటర్ బోర్డు 1,964మంది వినియోగదారుల నుంచి 5,002 ట్యాంకర్ల నీటిని కోరుతున్నారు. ఎద్దడి కారణంగా ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలన్న ప్రజల ఆత్రుత వలన వాటర్ ట్యాంకులకు డిమాండ్ పెరుగుతోందని అధికారులు అంటున్నారు .
నీటి ఎద్దడిని తగ్గించడం కోసం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మున్సిపల్ అధికారులకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్ లోని 4,500 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్కలసి యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా రూపొందింది. మెట్రోపాలిటన్ సిటీలో నీటి సంరక్షణకు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం కొన్ని టిప్స్ ను వాట్సప్ లో షేర్ చేస్తున్నారు.ఈ టిప్స్ ను పాటిస్తే కొంత మేరకు నీటి ఎద్దడిని నివారించవచ్చు.
ఈ టిప్స్ లో వాటర్ పైపుల నుంచి నీళ్ల లీకేజీని అరికట్టడం ముఖ్యమైనది. అందుకోసం అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ల్లో… తుప్పుపట్టిన పైపులను రిపేర్లు చేయిస్తే .. 25 నుంచి 40 శాతం వరకు నీటి వ్యర్థాన్ని అరికట్ట వచ్చు.అలాగే ప్రతి వర్షపునీటి బొట్టును నిలవ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని అధికారుల చెబుతున్నారు. దీంతో ప్రతి అపార్టు మెంటులో వర్షాకాలం నీటి సంరక్షణకోసం ఇంకుడు గుంతలు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వాష్ బేసిన్ లో పంపు నీటి నాజిల్ తిప్పి బ్రష్, లేదా షేవింగ్ చేస్తే 5 లీటర్ల నీరు పడుతుందని, అదే మగ్ తో తీసుకుని చేస్తే అరలీటరు నీటితో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. షవర్లు వాడితే 100 లీటర్లు, బకెట్ నీళ్లతో స్నానం చేస్తే 18 లీటర్ల నీరు సరిపోతుంది. అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా పైపుల నీటిని వాడితే 100 లీటర్లు, బకెట్ అయితే కేవలం 20 లీటర్లు నీరు సరిపోతుంది. వాషింగ్ మిషన్ లో బట్టలను పూర్తి సామర్థ్యంలో వాడాలని, బియ్యం, కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు వాడండి. అంటూ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Discussion about this post