సెన్సార్ కట్స్ కి ఒప్పుకోని ‘సలార్’! ఎందుకంటే..
డార్లింగ్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘సలార్’ మూవీపై హైప్ పతాక స్థాయికి చేరింది. డిసెంబర్ 22న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఇప్పటికే ‘సలార్’ సందడి మోతెక్కిపోతోంది. మూవీలో ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి. వీటిని కట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించినా నిర్మాత ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాత విజయ్ కిరగందూర్ స్వయంగా వెల్లడించారు.
‘సలార్’ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేయడంపై ఆయన మాట్లాడుతూ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఇంటెన్స్‌గా ఉంటాయని.. వీటిని చూసినపుడు ప్రేక్షకులు అసౌకర్యానికి గురికాకూడదన్న ఉద్దేశంతోనే సెన్సార్ కట్స్‌కు ఒప్పుకోలేదని చెప్పారు. సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇవ్వడానికి యాక్షన్ సీన్స్ ఒక్కటే కారణమని స్పష్టం చేసారు. సినిమాలో ఒక్క అసభ్యకర సన్నివేశం కానీ.. A సర్టిఫికెట్ సినిమాల్లో ఉండే ఇతర కంటెంట్ కానీ లేవని చెప్పారు.
మరోవైపు ‘సలార్’ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. మూవీ టికెట్స్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఏకంగా 10 లక్షల మంది ‘సలార్’పై ఆసక్తి చూపిస్తున్నారంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ‘సలార్’ సినిమా కంటెంట్ చాలా బాగుందని.. సినిమా వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
వాయిస్
మరోవైపు, ‘సలార్ పార్ట్ 2’ ఎప్పుడనే దానిపై నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ సిద్ధమైందని చెప్పారు. రెండు భాగాలు చూస్తేనే సలార్ సినిమా పూర్తవుతుందని ప్రేక్షకులు గమనిస్తారని వివరించారు. సలార్ పార్ట్ 1 విడుదలయ్యాక దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంటారని.. తర్వాతే సలార్ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
Discussion about this post