నౌకాదళ హెలికాఫ్టర్ మొదటి మహిళా పైలెట్ గా అనామిక రాజీవ్ నియమితులయ్యారు. తమిళనాడులోని అరక్కోనంలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ లో ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ ను ఆమె అందుకున్నానరు. లడఖ్ నుంచి నావెల్ ఆఫీసరుగా ఎంపికైన లెఫ్ట్ నెంట్ జమ్యాంగ్ తెస్వాంగ్ కూడా హెలికాఫ్టర్ పైలెట్ నియామకాలు జరిగాయనిన భారత నౌకాదళం తెలిపింది.
సబ్ లెఫ్టెనెంట్ అనామిక, లెఫ్ట్ నెంట్ త్సెవాంగ్ తో సహా మరో 21 మంది ఆఫీసర్లకు వైస్ అడ్మిరల్ రాజేష్ పెంథాకర్,ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఈస్ట్రరన్ నావెల్ కమాండ్, ది పాసింగ్ అవుట్ పరేడ్ INS రజలీలు గోల్డెన్ వింగ్స్ అవార్డులు అందించారు. 22 వారాల ఫ్లైయింగ్ , గ్రౌండ్ ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమాలను ఇండియన్ నావల్ ఎయిర్ స్క్యాడ్రన్ 561 పూర్తి చేశారు. భారత నౌకాదళంలో మహిళలకు కూడా అవకాశాలు కల్పించాలన్న దృష్టితో హెలికాఫ్టర్ పైలెట్ గా శిక్షణ ఇచ్చామని నౌకాదళం తెలిపింది.
కేంద్రపాలిత ప్రాంతం అయిన లడఖ్ నుంచి లెఫ్టెనెంట్ జమ్యాంగ్ తెస్వాంగ్ విజయవంతంగా హెలికాఫ్టర్ పైలెట్ శిక్షణ పూర్తి చేసి నావెల్ ఆఫీసర్ గా ననియమితులయ్యారన్నారు. డోర్నియర్ 228 మారిటైమ్ నిఘా ఎయిర్ క్రాఫ్ట్ లో మహిళా పైలెట్లను నియమించామన్నారు. మొదటి మహిళా పైలెట్ సబ్ లెఫ్టెనెంట్ అనామిక రాజీవ్… సీకింగ్స్, ALH ద్రువ్స్, చేతక్, MH-60R సీహాక్స్ ను నడుపుతారన్నారు.
భారత వైమానిక దళంలో మొదటి ఫ్లైయింగ్ ఆఫీసర్ గా అవని చతుర్వేది చరిత్ర సృష్టించారు. 2018లో ఆమె మిగ్ -21 బైసన్ నడిపారు. 2016 జులైలో ముగ్గురు సభ్యుల మహిళా బృందంలో ఉన్నారు. మిలటరీ అధికారులు దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఐదు దశాబ్దాల నుంచి హెలికాఫ్టర్ శిక్షణలో INS రాజలి పేరుగాంచింది. ఇక్కడి నుంచి 849 మంది పైలెట్లు ఇండియన్ నావీ నుంచి, కోస్టు గార్డులే కాకుండి మిత్ర దేశాల వారు కూడా శిక్షణ పొందారు. కొత్తగా మరో 102 మంది హెలికాఫ్టర్ కన్వెర్షన్ కోర్సును పూర్తి చేశారు. వీరంతా పర్యవేక్షణ, నిఘా, అన్వేషణ , రెస్క్యూ, సముద్ర దొంగల నుంచి రక్షణ బాధ్యతలను నిర్వహిస్తారు.
Discussion about this post