అనంతపురంలో నిర్లక్ష్యానికి నిదర్శనం నగరంలోని ఎన్టీఆర్ మార్గం. మున్సిపాలిటీ పర్యావరణ శాఖలో పచ్చదనాన్ని అధికారులు ఖూని చేశారు. వైసీపీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్ ను సుందరంగా తీర్చేందుకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లో మొక్కలు కోసం టెండరు పిలిచారు. టెండరు ప్రకారం ఒక్కో మొక్క పదివేల రూపాయలతో రూ. 220 మొక్కలు ఆర్డర్ ఇచ్చారు. ఈ మొక్కలు దాదాపు 5 అడుగుల ఎత్తు కలిగి ఉండాలి. అయితే అక్కడ పెట్టిన మొక్కలు ఒకటి నుండి రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాయి. అభివృద్ధి అంటే స్థానిక ఎమ్మెల్యే, మేయరు, కమిషనర్ మొదలైన వారందరూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని జరపాల్సి ఉండగా… ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, కనీసం ఒక కార్పొరేటర్ కూడా లేకుండా మొక్కలు నాటే కార్యమాన్ని ముగించారు. అంతే కాకుండా మొక్కలు నాటిన తర్వాత నీళ్లు పోయకపోవడంతో ఆ మొక్కలు వాడిపోయి, చనిపోవడానికి సిద్దంగా ఉన్నాయి.
Discussion about this post