పురాతన వస్తువులు ఏవన్నా దొరికితే వాటిని అపురూపంగా చూసుకుంటాం. అదే తినే పదార్థం ఏదైనా పురాతనమైంది దొరికితే …ఏంటి అని ఆలోచిస్తున్నారా? ..ప్రపంచంలో అత్యంత పాతదైన బ్రెడ్ గురించి మీకు తెలుసా? టర్కీ కొన్యా ప్రావిన్స్‌లోని కాటల్హోయుక్లో 8,600 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన రొట్టెను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఆ రొట్టె అవశేషాలు ‘మెకాన్ 66’ అనే ప్రాంతంలో పాక్షికంగా ధ్వంసమైన సమీపంలో కనుగొనబడ్డాయి. దాని చుట్టూ పురాతన మట్టి, ఇటుక ఇళ్లు ఉన్నాయి. అనాడోలు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్, పురావస్తు శాస్త్రవేత్త అలీ ఉముట్ తుర్కాన్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. బ్రెడ్ చాలా గుండ్రంగా, మెత్తగా కాల్చకుండా పులియబెట్టినట్లు ఉందని ఆయన అన్నారు. దానిని మధ్యలో వేలితో నొక్కితే లోపల ఉన్న పిండి పదార్థాలు నేటికీ సజీవంగా ఉన్నాయని చెప్పారు. స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ నుంచి పొందిన చిత్రాల ప్రకారం బ్రెడ్ లోపల స్టార్చ్ కణాలు కనిపించాయని చెప్పారు. అయితే పిండి, నీరును కలిపి ఆ కాలంలోనే తయారు చేయడం విశేషమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Discussion about this post