శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బంటు కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయభవన ప్రారంభోత్సవంలో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. మంత్రి సమక్షంలోనే వైసీపీ నాయకులు ఓ అంగన్వాడీ కార్యకర్త, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. బంటుకొత్తూరుకి చెందిన అంగన్వాడీ కార్యకర్త రాగోలు అప్పలనర్సమ్మను ఐదేళ్లుగా స్థానిక వైసీపీ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం మంత్రి సీదిరి అప్పలరాజు సచివాలయ భవనాన్ని ప్రారంభించగా.. ఈ కార్యక్రమానికి అప్పలనర్సమ్మ హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పలనర్సమ్మపై వైసీపీ నాయకులు దాడి చేసి.. అమర్యాదగా ప్రవర్తించారు. నిలదీసిన ఆమె భర్త నీలకంఠ, కుమారుడు సాయికిరణ్‌ను కూడా కొట్టడంతో…వారంతా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంగన్వాడి కార్యకర్త కుటుంబమే తమపై దాడి చేసిందంటూ బంటుకొత్తూరు సర్పంచ్ పిట్ట షణ్ముఖరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇరువర్గాలూ స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
Discussion about this post