జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అంగన్ వాడీ టీచర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నెల్లూరు జిల్లాలో వేల సంఖ్యలో అంగన్వాడీలు తమ సమ్మెను ఉధృతం చేసి కలెక్టరేట్ ను ముట్టడించారు. పోలీసులు కలక్టరేట్ ప్రధాన ద్వారం వైపు 100 మీటర్ల దూరంలోనే మూడంచెల బారికేడ్ లను ఏర్పాటు చేసి వారిని నిలువరించారు.
వేతనం పెంచే వరకు సమ్మెకొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీను విస్మరించారంటూ నిందిస్తూ నినాదాలు చేశారు. విధులకు హాజరు కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంలో అర్థం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అజయ్ ఫైర్ అయ్యారు. ఈ అంశం పై 4 సైడ్స్ టీవీ ప్రతినిధి శ్రీధర్రెడ్డి మరింత సమాచారం అందిస్తారు.























Discussion about this post