ఖమ్మం జిల్లాలో అంగన్‌వాడీలు నిరసనుకు దిగారు. తమకు సరైన వేతనాలను ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్యావిభాగాన్ని బలోపేతం చేయాలంటున్నారు. అంగన్వాడీ టీచర్‌లను 3వ తరగతి, 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలన్నారు. కనీస వేతనం కింద నెలకు 26 వేల రూపాయలను పెన్షన్ కింద నెలకు 10 వేల రూపాయలను ఇవ్వాలని కోరుతున్నారు. పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించలంటున్నారు. రాష్ట్రంలో 24 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Discussion about this post