శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో ఐదో రోజు కొండ దిగువన నిర్వహించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు జరిగిన ఈ రథోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు. సత్యరథాన్ని ఉదయం తొమ్మిది గంటలకు పంపా సత్రం నుంచి తొలిపావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ రథాన్ని రంగురంగుల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను అర్చకస్వాములు ఊరేగింపుగా కొండదిగువన తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన నూతన రథంపై స్వామి, అమ్మవార్లను ఉంచి పూజలు చేశారు. ఐదు గంటలకు రథం ముందు కుంభం పోసి గుమ్మడికాయతో అర్చకులు దిష్టి తీయగా…దేవస్థాన అధికారులు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు.
Discussion about this post