కెనడాలో చదువుకోవాలన్న భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది ఇన్ టేక్ పరిమితులు దెబ్బదీయగా, లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ LMIA ప్రోగ్రాం వరంగా మారింది. కెనడా యాజమాన్యాలు స్థానికులను ఉద్యోగులుగా నియమించుకునే అవకాశాలు విఫలమైతే విదేశీ ఉద్యోగులను నియమించుకునే వెలుసు బాటు ఉండటమే LMIA ప్రోగ్రాం. దీంతో చాలా మంది భారతీయులు దీనికి మొగ్గు చూపుతున్నారు.
కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులను చేర్చుకోవడంలో ఈ ఏడాది జనవరి నుంచి పరిమితిని విధించింది. అది రెండేళ్ల పాటు కొనసాగుతుంది. 2024లో 3 లక్షల 60 వేలమందికి మాత్రమే అనుమతిని ప్రకటించగా, గతేడాదితో పోల్చితే 35 శాతం తక్కువగా ఉంది. అయితే కెనడాలో వర్కర్స్ కొరత తీవ్రంగా ఉండటంతో విదేశీయులతో దానిని భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ LMIA ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. ఔత్సాహిక విదేశీ వర్కర్లు కెనడా అధికారిక వెబ్ సైట్ ద్వారా సంప్రదిస్తే.. LMIA నుంచి కన్మర్మేషన్ లేఖను అందుకోవచ్చు. యజమాని LMIA కు సంసిద్దత తెలపగానే విదేశీ వర్కర్లు ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో యజమాని సదరు వర్కర్ కు ఆఫర్ లెటర్ , కాంట్రాక్ట్ ఒప్పదం పంపుతారు. కెనడాలో ప్రవేశపెట్టిన ఈ పథకం భారత్ లో బాగా ఉపయోగపడుతోంది.
అంతర్జాతీయంగా స్టుడెంట్ వీసాలకు డిమాండ్ పెరగడం,కెనాడా లో చదువులకు అధిక ఫీజులు, ఇతర ఖర్చులతోపాటు, జీవన వ్యయం ఎక్కువగా ఉండటంతో విద్య కంటే స్కిల్డ్ లేబర్ గా వెళ్లడమే బెటర్ అని భారతీయులు భావిస్తున్నారు. అక్కడ రైతు, డెయిరీ లేబర్ కు కొరత ఉంది. వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్లు, కేర్ టేకర్లను అక్కడ ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా హెల్త్ కేర్ , టెక్నాలజీ రంగాల్లో కూడా అపారంగా ఉద్యోగాలున్నాయి. విద్యార్థి వీసాలురాని భారతీయులు LMIA కు మొగ్గు చూపుతున్నారు. కెనడాలో రోజురోజుకు నైపుణ్య పనివారికి డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం.
LMIA అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 1000 కెనేడియన్ డాలర్లు అనగా రూ. 61,000 యజమాని చెల్లించాల్సి ఉంది. అదే విద్యార్థి వీసాకైతే సుమారు 23 లక్షల రూపాయలు అవసరమవుతాయి. విద్యార్థులు ఇంగ్లీషు లో పట్టు సాధించడం కష్టతరమవడంతో ఎక్కువ మంది భారతీయులు LMIA వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడి విధివిధానాలతో సమ్మతి పొందినప్పటికీ శాశ్వత నివాసానికి గ్యారెంటీ ఉండదు. నిపుణత గల విదేశీ ఉద్యోగులు ఎక్స్ ప్రెస్ ఎంట్రీ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ లో అక్కడ చేపట్టబోయే వృత్తిని బట్టి విద్యార్హతలు, వయస్సు, ఆయా రంగాల్లో అనుభవం, ఇంగ్లీషు భాషా నైపుణ్యాల పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Discussion about this post