బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో బిగ్ షాక్ తగిలింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు.
Discussion about this post