పాప్ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్‌గా ఎంపిక
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 2023 పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్‌గా ఆయన ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ అవార్డ్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.
ఈ అవార్డు కోసం రామ్ చరణ్‌తో పాటు షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే, అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, రిద్ధి డోగ్రా, రాశీ ఖన్నా నామినేషన్స్ దక్కించుకోగా ఫైనల్‌గా రామ్ చరణ్‌ని అవార్డు వరించింది. ఇటీవలే రామ్ చరణ్ ఆస్కార్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘గోల్డెన్ బాలీవుడ్ అవార్డు’ కి ఎంపికవడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అభినందనలతో ముంచెత్తుతున్నారు.
మరోవైపు ఇటీవల గోవాలో జరిగిన 54వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ ఉన్న ఫోటోను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గోవా ఫిలిం ఫెస్టివల్ ఎంట్రీ గేటు వద్ద రామ్ చరణ్ ఫోటో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఖుషీ అయ్యారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్ర ఖని, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2024 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Discussion about this post