పదవ తరగతి పరీక్షలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం అన్నారు. విద్యశాఖ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32, 355 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 139 పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్ పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
Discussion about this post